High Court on Parchur Removal Votes : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పరిధిలో కుట్రపూరితంగా ఫారం-7లు దాఖలు చేసి ఓటును తీసేయడానికి జరిగిన యత్నంపై దాఖలైన వ్యాజ్యాలలో హైకోర్టు స్పందించింది. తుది ఓటరు జాబితా నుంచి పిటిషనర్ల పేర్లను తొలగించొద్దని అధికారులను ఆదేశిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు పర్చూరు శాసనసభ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌ఓ) తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది.
Parchur Removal Votes Case : ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులపై ఈఆర్‌ఓ తేదీని ఎందుకు ప్రస్తావించలేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్లకు రిజిస్ట్రర్ పోస్టు ద్వారా సమాచారాన్ని పంపిన తేదీని పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టింది. ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండా, వాస్తవాలను దాచిపెట్టి హైకోర్టులోని స్టాడింగ్ కౌన్సిల్‌కు సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. అందుకు కారణాలేమిటో వారికే తెలుసంది. పిటిషనర్ల పేర్లతో ఓటర్ల జాబితా నుంచి తొలగించొద్దని పేర్కొంటూ విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.
Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు
Removal Votes in Parchur : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఈ నెల 5న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫారం-7ను ఆధారం చేసుకొని, పారదర్శకత పాటించకుండా తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని పేర్కొంటూ పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బి.గౌతమి మరో పది మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై పర్చూరు నియోజకవర్గంలోని అన్నంబొట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, బోడవాడ, దేవరపల్లి, అడుసుమల్లి, నాగులపాలెం గ్రామాలకు చెందిన ఓటర్లు పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఈనెల 5న హైకోర్టులో విచారణ జరిపింది.
Removal Votes in AP : ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎక్కడైనా ఒక చోట ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉందని పిటీషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా పిటిషనర్ల ఓట్లు తొలగించాలని ఫారం-7లు సమర్పించారన్నారు. వివాహానంతరం ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారన్న కారణంతో పిటిషనర్ల ఓట్లు తొలగించేందుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిందన్నారు. వారికి ఇతర ప్రాంతాల్లో ఓటు లేనందున స్వగ్రామంలో ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ వెసులుబాటును అధికారులు దెబ్బతీస్తున్నారన్నారు. దీంతో ఓటును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
పర్చూరులో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు - బీఎల్వోలతో ఎన్నికల సంఘం విచారణ
Fake Votes in AP : ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు ఉంచిన వివరాలను న్యాయమూర్తి పరిశిలించారు. "పిటిషనర్లు సమర్పించిన అభ్యంతరాలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. దానిని పరిశీలించాం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం తగిన ఉత్తర్వులిచ్చాం. ఆ వివరాలను పోస్టు ద్వారా పిటిషనర్లకు పంపాం" అని ఈఆర్‌ఓ పేర్కొన్నప్పటికీసెక్షన్ 22ను ఆనుసరించి జారీచేసిన ఉత్తర్వులపై ఈఆర్‌ఓ తేదీని ప్రస్తావించకపోవడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.
రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే - అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!