ETV Bharat / state

చీరాల రాజకీయాలలో చర్చకు తెరలేపిన.. జనసేన ఫ్లెక్సీ - జనసేనలోకి ఆమంచి స్వాములు

Flexi Become a Hot Topic in Chirala Politics: జనసేన సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చకు తెరలేపింది. అసలు ఈ ఫ్లెక్సీలు ఏం చేశాయో తెలియాలంటే.. ఇది చదివేయండి మరి.

Janasena flexi in chirala
చీరాలలో జనసేన ఫ్లెక్సీ
author img

By

Published : Feb 11, 2023, 2:12 PM IST

Flexi Become a Hot Topic in Chirala Politics: ఓ ఫ్లెక్సీ.. చీరాల రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్​గా నడుస్తోంది. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అని ప్రజలంతా ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని ప్రజలు అనుకుంటున్నారు.

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర చర్చ నీయాంశమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నేత ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు ఫొటోల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ అంశం చీరాల రాజకీయాలలో తీవ్ర చర్యనీయాంశమైంది. ఆమంచి కృష్ణమోహన్ గతంలో రెండు పర్యాయాలు చీరాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవలే పర్చూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్​గా ఆమంచి కృష్ణమోహన్ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులు కూడా గడవకముందే చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆమంచి స్వాములు ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రానున్న రోజుల్లో రాజకీయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే?: జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం.. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అయింది. గత రెండు విడతలలో సభ్యత్వ నమోదు విజయవంతం అయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ వీడియోని కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ప్రారంభమైన మూడవ విడత సభ్యత్వ నమోదుని కూడా జయప్రదం చేయాలని జనసైనికులను, జనసేన నాయకులను, వీరమహిళలను పవన్ కల్యాణ్ కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.