Fake TTEs Detained in Railway Station: డిగ్రీలు చదివిన ముగ్గురు యువకులు.. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. ఓ వ్యక్తి రైల్వే శాఖలో టీసీ కొలువులంటే నమ్మేశారు. నకిలీ ఐడీ కార్డులు, కోటు ఇస్తే రైలెక్కేశారు. శిక్షణ పేరుతో కేసులు రాస్తూ.. రైల్వేలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. వీరిలో ఓ యువకుడు.. అసలైన టీసీ కంట పడటంతో బండారం మొత్తం బయటపడింది.
Fake TCs in Chirala Railway Station: చీరాలలో నకిలీ టీటీఈల వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైల్వే పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాలలో నకిలీ టీటీఈల గుట్టురట్టయింది. వరంగల్ జిల్లాకు చెందిన కల్యాణ్, గణేష్, మహబూబాబాద్ కు చెందిన ప్రవీణ్ నిరుద్యోగులు.
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి పట్టాలపై - చావు అంచుల వరకు వెళ్లిన వ్యక్తి
వీరికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి, వారి నుంచి లక్షల రూపాయల సొమ్ము వసూలు చేశాడు. తర్వాత వారికి టీసీ ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి నకిలీ ఐడీ కార్డులు, జరిమానా పుస్తకాలు అందజేశాడు.
Railway Police Arrested Three Fake TCs: శిక్షణ పేరుతో విజయవాడ-ఒంగోలు మధ్య రైళ్లలో తిరుగుతూ రోజుకు కనీసం మూడు కేసులు రాయాలని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ యువకులు కొద్దిరోజులుగా టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా వేస్తూ ఆ డబ్బు తెచ్చి తెనాలి వ్యక్తికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో రోజూ లాగే చీరాల రైల్వే స్టేషన్లో కేసులు రాస్తున్న గణేష్‌ను అసలైన టీటీఈ రాజేష్ గమనించి, అనుమానం వచ్చి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.
నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో - ఖాతాల్లో నగదు మాయం చేస్తున్న ముఠా అరెస్ట్
Fake Tcs Arrested in Chirala Railway Station: రైల్వే పోలీసులకు చెప్పగా వారు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు నకిలీ టీసీలు ఉన్నారని అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకులు నిజమే చెబుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Fake Tcs in Bapatla District: డిగ్రీ చదివిన యువకులు టీసీ ఉద్యోగాలంటే నమ్మి డబ్బులు ఇవ్వడం.. ట్రైనింగ్‌లో భాగంగా జరిమానాలు వసూలు చేసి తెమ్మంటే.. అతడికి తీసుకువెళ్లి ఇవ్వడం నమ్మశక్యంగా లేవని, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్న నేరం కావచ్చని కొందరు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.