ETV Bharat / state

గడప గడప కార్యక్రమంలో ఉద్రిక్తత.. స్థానికుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో.. ఎమ్మెల్యే స్థానికుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే చేయి చేసుకున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు స్థానికుడ్ని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అతను వైసీపీ సానుభూతి పరుడని గ్రామస్థులు అంటున్నారు.

Niruvari Palli
నీరువారిపల్లి
author img

By

Published : Feb 4, 2023, 11:56 AM IST

అన్నమయ్య జిల్లాలో సమస్య గురించి మాట్లాడినందుకు వైసీపీ సానుభూతి పరుడిపై.. స్థానిక ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ సానుభూతి పరుడ్ని పోలీసులు స్టేషన్​కు తరలించారు. దీంతో కొందరు గ్రామస్తులు పోలీస్​ స్టేషన్​ వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా మరోవైపు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఈ సమయంలో అక్కడ తోపులాట జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నమయ్య జిల్లా మదనపల్లి పురపాలక సంఘం నీరువారిపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు కార్యక్రమలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వైసీపీ సానుభూతిపరుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రోడ్డు సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. తమ కాలానీలో ఉన్న రోడ్డుపై మరో రోడ్డు నిర్మిస్తే ఇప్పుడు ఉన్న ఇళ్లు ఎత్తు తగ్గుతుందని విన్నమిస్తూ.. ఎమ్మెల్యే చేయి పై అభిమానంతో చేయి వేశాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకున్నాడని వారు అంటున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లక్ష్మీనారాయణను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. మరో వైపు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడారు ఈ సమయంలో అక్కడ తోపులాడు జరిగింది. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరును గ్రామస్థులు తప్పుబడుతున్నారు. సమస్య గురించి చెప్తే ఇలా చేయి చేసుకుంటారా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.