ETV Bharat / state

హైదరాబాద్​లో తెరాస ఎమ్మెల్యేలకు ఎర .. నిందితుడిగా అన్నమయ్య జిల్లా వాసి

Simhayaji : తెలంగాణలో సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల వివాదంలో పట్టుబడిన సింహయాజి.. అన్నమయ్య జిల్లా వాసి. స్కూల్​ టీచర్​గా ప్రయాణం మొదలు పెట్టిన అతను.. 10ఏళ్ల తర్వాత స్వామీజీ అవతారం ఎత్తాడు. తాజాగా మునుగోడు ఎన్నికల సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రలోభ పెట్టే వివాదంలో పట్టుబడిన ముగ్గురిలో సింహయాజి కూడా ఉండడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Simhayaji
Simhayaji
author img

By

Published : Oct 27, 2022, 9:45 AM IST

Simhayaji : హైదరాబాద్‌లో తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల వివాదంలో పట్టుబడిన సింహయాజి.. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రామనాథపురం గ్రామానికి చెందిన వ్యక్తి. అతని అసలు పేరు అశోక్. 20 ఏళ్ల కిందట ఇదే గ్రామంలో చిన్న ప్రైవేట్ స్కూలు నిర్వహించారు. అది సరిగ్గా సాగకపోవడంతో తీసేసి.. ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. 10 ఏళ్ల తర్వాత స్వామీజీ అవతారం ఎత్తి .. రామనాథపురంలోనే శ్రీమంత్ర రాజ పీఠం ఏర్పాటు చేశారు. దానికి తనకు తాను పీఠాధిపతిగా ప్రకటించుకొని ప్రాచుర్యం పొందాడు.

ఈ గ్రామంలోనే నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి 10 ఏళ్ల కిందట ప్రయత్నం చేసిన వ్యవహారం బెడిసి కొట్టింది. ఆ ప్రాంతంలో ఎవరూ ఆయన్ని స్వామీజీగా విశ్వసించకపోవడంతో తిరుపతికి మకాం మార్చారు. 15 ఏళ్లుగా అక్కడే ఓ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి స్వగ్రామైన రామనాథపురానికి వచ్చి వెళ్తుంటారని స్థానికులు తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మునుగోడు ఎన్నికల సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రలోభ పెట్టే వివాదంలో పట్టుబడిన ముగ్గురిలో సింహయాజి కూడా ఉండడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.