ETV Bharat / state

Warden attacked the hostel students వసతిగృహ విద్యార్థులను చావబాదిన వార్డెన్‌ - విద్యార్థులను చావబాదిన హాస్టల్​ వార్డెన్​

Warden attacked the hostel students అన్నమయ్య జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులపై వర్డెన్​ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అల్లరి చేస్తున్నారని పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే.

students
గాయపడిన విద్యార్థులు
author img

By

Published : Aug 24, 2022, 10:10 AM IST

Warden attacked the hostel students అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం శ్రీరాములపేట సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతిగృహ విద్యార్థులను అల్లరి చేస్తున్నారని వార్డెన్‌ చితకబాదారు. ఈ ఘటనలో 9 మంది పిల్లలు తీవ్రంగా గాయపడటంతో చేతులకు కట్టుకట్టారు. మరికొందరికి చేతులు, కాళ్లు వాచాయి. దాదాపు 30 మందిని షటిల్‌ బ్యాట్‌తో కొట్టారని పిల్లలు ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం వసతిగృహంలో దాదాపు 200 మంది విద్యార్థులకు 120 మంది హాజరయ్యారు. రాత్రి విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో కొందరు విద్యార్థులు కేకలు వేశారు. దీన్ని గమనించిన వార్డెన్‌ హరికృష్ణ అల్లరి చేసిన విద్యార్థులు ఎవరో ముందుకు రావాలన్నారు. ఎవరూ రాకపోవడంతో కోపంతో షటిల్‌ బ్యాట్‌తో పిల్లల్ని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. పిల్లల్ని కొట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తమ పిల్లల్ని కొట్టిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వసతిగృహ ఆవరణలో నిరసన తెలిపారు. దీనిపై వసతిగృహ అధికారి హరికృష్ణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విద్యార్థులు అల్లరి చేస్తుంటే కట్టడి చేసే ప్రయత్నం చేశానని, తీవ్రంగా కొట్టలేదని సమాధానమిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.