CATTLE FESTIVAL : సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికీ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు.. తిరుపతి జిల్లాలో పశువుల పండగ గుర్తుకొస్తాయి. రాయలసీమ ప్రాంతమైన తిరుపతి జిల్లాలోని ఎ.రంగంపేటలో కనుమ రోజున పశువుల పండుగను వైభవంగా నిర్వహిస్తారు. పశువులను అలంకరించి వాటి కొమ్ములకు వారి ఇష్ట దైవం పటాలు, ప్రముఖ హీరోల చెక్క పలకలను కడతారు. అనంతరం పశువులను పురవీధుల్లో వదులుతారు. పటాలను, చెక్కపలకను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఈ క్రమంలో ఎవరైనా గాయపడితే అక్కడే ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్యం అందిస్తారు. పోటీలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే ప్రేక్షకులకు.. నిర్వాహకులు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేస్తారు.
పశువుల పండుగ తిలకించడానికి వచ్చినవారిని పలకరించిన చంద్రబాబు: తిరుపతి జిల్లా ఎ.రంగంపేటలో పశువుల పండుగను తిలకించేందుకు వచ్చినవారిని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలకరించారు. 3 రోజులపాటు స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు నేడు.. అన్నమయ్య జిల్లా పీలేరుకు బయల్దేరారు. పీలేరు వైపు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్.. ఎ.రంగంపేటలో నిలిచింది. అక్కడ పశువుల పండుగలో తెలుగుదేశం నేతలు అమర్నాథ్‌రెడ్డి, సుగుణమ్మ, పులివర్తి నాని పాల్గొన్నారు. చంద్రబాబు కూడా పీలేరు వెళ్తూ రంగంపేటలో నిలిచారు. కాన్వాయ్ దిగి.. పశువుల పండుగ తిలకించేందుకు వచ్చిన వారితో మాట్లాడారు.
ఇవీ చదవండి: