- న్యూఇయర్ ఎఫెక్ట్.. ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..!
2023 effect record revenue increased in AP: నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పొంగిపొర్లింది. ఒక్కరోజేలోనే ఊహించని స్థాయిలో రికార్డు ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయాలే లక్ష్యంగా ప్రభుత్వం.. మద్యం దుకాణాలు, బార్లలో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో మూడు గంటలు విక్రయించేందుకు అనుమతిచ్చింది.
- గుంటూరు ఘటనలో మృతుల కుటుంబాలకు భారీగా అర్థిక సాయం..
Uyyuru Foundation: చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. మృతల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అటు ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉయ్యూరు ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్ వెల్లడించారు. అటు చంద్రబాబు కూడా పార్టీ తరుపున మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
- తిరుమలలో మరో అన్నప్రసాద వితరణ కేంద్రం.. త్వరలో అందుబాటులోకి మరో రెండు కేంద్రాలు
Annaprasada Distribution Center in Tirumala: తిరుమలలో మరో అన్నప్రసాద వితరణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. భక్తులు రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరిన్ని భవనాలను భక్తుల సౌకర్యార్ధం తీసుకొస్తామని తెలిపారు.
- రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత.. మహాసేన రాజేష్‌పై దాడి
Attack on Mahasena chief Rajesh: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన నగర నాయకుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహాసేన అధినేతపై కొంతమంది అల్లరి మూకలు దాడి చేశాయి. కారు అద్దాలను పగలగొట్టి నానా రచ్చ చేశారు.
- 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్.. రిపబ్లికన్ల మద్దతు లేకున్నా ముందుకే..
అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్లు వ్యతిరేకించినా ఈ విషయంలో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. తృతీయపక్ష అభ్యర్థిగానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు.
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- 'ఓపెనర్‌గా రాహుల్ వద్దు.. ఇషాన్ కిషన్‌కు అవకాశమివ్వండి'.. గంభీర్ సలహా
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఓపెనర్‌గా ఆడించడాన్ని తప్పుబట్టాడు. అతడి ప్లేస్‌లో మరో యువ క్రికెటర్‌ను ఆడించాలని సూచించాడు. ఇంకా ఏమన్నాడంటే..
- మాస్ మొగుడు వీరసింహారెడ్డి ట్రైలర్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ లుక్‌లో అమిగోస్
బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా చిత్ర బృందం ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నారు. మరోవైపు, కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మూవీ 'అమిగోస్' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేసింది ఈ చిత్రబృందం.