ETV Bharat / state

ఆలోచనలేని ఆవేశం.. నాలుగు ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

Man Killed Four People in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఆలోచనలేని ఓ వ్యక్తి ఆవేశం తనను మృగాన్ని చేసింది. బాధ్యతను మరిచి చేసిన పనులు పచ్చని సంసారంలో మంటలు పెట్టడమే కాకుండా, తల్లి కడుపులో ఉన్న పసిగుడ్డు సహా 4 ప్రాణాలను బలిగొంది. 10రోజుల క్రితం హైదరాబాద్‌ నారాయణగూడలో దంపతులపై జరిగిన పెట్రోల్‌ దాడి ఘటన విషాదాంతమైంది.

Man Killed Four People in Hyderabad
Man Killed Four People in Hyderabad
author img

By

Published : Nov 17, 2022, 2:19 PM IST

Man Killed Four People in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ చిక్కడపల్లికి చెందిన ఆరతి, నారాయణగూడ ఫ్లైఓవర్‌ కింద పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఎనిమిది ఏళ్ల క్రితం ఆరతికి, నాగసాయి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించగా, ఐదేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. మూడేళ్ల క్రితం నాగసాయికి, ఆరతి సోదరుడు జితేందర్‌ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జితేందర్‌ను హత్య చేసేందుకు యత్నించి, నాగసాయి జైలుకెళ్లాడు.

ఆలోచనలేని ఆవేశం.. నాలుగు ప్రాణాలు బలి

మూడేళ్లుగా నాగసాయి జైలులో ఉండగా, నాగరాజు అనే మరో వ్యక్తిని ఆరతి వివాహం చేసుకుంది. వీరికి 10నెలల బాబు విష్ణు ఉండగా, ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన నాగసాయి, ఆరతి మరో వివాహం చేసుకుందన్న విషయం తెలుసుకుని కోపం పెంచుకున్నాడు. వారిని వదిలేసి తనకు వద్దకు రావాలని హెచ్చరించినా, ఆరతి అందుకు అంగీకరించలేదు.

దీంతో ఎలాగైనా వారిని అంతమొందించాలని భావించిన నాగసాయి.. స్నేహితుడు రాహుల్‌తో కలిసి పథకం పన్నాడు. ఈ నెల 7న నారాయణగూడ ఫ్లైఓవర్‌ కింద పూలు అమ్ముకుంటున్న నాగరాజు-ఆరతి దంపతుల వద్దకు వెళ్లిన నాగసాయి, వారితో గొడవపడ్డాడు. రాత్రి 8గంటల సమయంలో నాగరాజు-ఆరతితో పాటు వారి వద్ద ఉన్న 10నెలల బాబు విష్ణుపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి పారిపోయాడు.

గమనించిన స్థానికులు, పక్కనే ఉన్న నారాయణగూడ ఠాణా పోలీసులు అక్కడికి చేరుకుని, మంటలను అదుపు చేసి, ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు చిన్నారి విష్ణు ప్రాణాలు కోల్పోయాడు. మూడ్రోజుల తర్వాత ఆస్పత్రిలోనే నాగరాజు చనిపోయాడు. 5నెలల గర్భంతో 9రోజుల పాటు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడిన ఆరతి సైతం ప్రాణాలు విడిచింది.

ఇలా భార్యబిడ్డతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో, నాగసాయి జైలునుంచి బయటికొచ్చాక ఆవేశంతో చేసిన దుశ్చర్యతో కుటుంబం విషాదాంతమైంది. 10రోజుల క్రితం పెట్రోల్‌దాడి చేసి పరారైన నాగసాయి, తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి పారిపోయి నల్గొండకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి ఇద్దరిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరిపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.