తాను చేసిన కల్వర్టు పనులకు బిల్లులు చెల్లించిన అనంతరం.. దానిపై సీసీ రోడ్డు వేసుకోమని చెప్పినందుకు వైకాపా నాయకులు తనపై దాడి చేశారని అక్కులప్ప ఆరోపించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో గతేడాది కల్వర్టు పనిని పూర్తి చేశారు. అదే కల్వర్టుపై కొంత మంది వైకాపా నేతలు సీసీ రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా అక్కులప్ప అడ్డుకున్నారు. తనకు కల్వర్టుకు సంబంధించిన బిల్లులు రాలేదని, సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు తనపై దాడి చేశారన్నారు. గాయపడ్డ అక్కులప్ప కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి...