అనంతపురం జిల్లా గుత్తిలో చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. చెర్లోపల్లి కాలనీకి చెందిన శివ.. తామర పువ్వుల కోసం.. గుత్తి సమీపంలో చెరువుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారీ నష్టాల్లో మార్కెట్లు- 38 వేల దిగువకు సెన్సెక్స్