ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగులమందు తాగాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై జరిగింది. కులమతాలకు అతీతంగా ఎవరు ప్రేమించకండి అంటూ విడపనకల్ మండలానికి చెందిన సుధాకర్... పురుగులమందు తాగుతూ సెల్ఫీ వీడియోను తీసుకొని.. తన మిత్రులకు పంపాడు.
వారు ఆ దృశ్యాలు చూసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. ప్రేమ విఫలం కావటం వల్లే ఈ ఘటన పాల్పడినట్లు.. పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండీ... స్టీల్ ప్లాంట్‌పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ