రాష్ట్పంలో అమలవుతున్న సంక్షమ పథకాలను చూసి ఓర్వలేకే... వైకాపా ప్రభుత్వంపై తెదేపై ఎంపీలు ఆరోపణలు చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే తెదేపా ఎంపీలు రాష్ట్రపతిని కలిశారన్నారు. తెలుగుదేశం ఎంపీలు దిల్లీకు వెళ్లి వైకాపాపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రపతి దగ్గరకు తీసుకవెళ్లిన ఫైల్స్ అన్నీ గతంలో తెదేపా నేతలు చేసిన తప్పుల లిస్ట్ అని ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు. గత ప్రభుత్వం అన్ని పథకాల్లో అవినీతి చేసిందని ఆరోపించారు. తెదేపా నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
ఇదీ చదవండి: పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు