గతేడాది నామపత్రాలు వెనక్కు తీసుకున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు.. గుంటూరు కలెక్టరేట్‌కు క్యూకట్టారు. అప్పట్లో నామినేషన్లు దాఖలు చేయగా.. అధికార పార్టీ నేతలు బెదిరించి, ఉపసంహరించుకునేలా చేశారని పలువురు వాపోయారు. మరలా నామినేషన్ వేసేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. శావల్యాపురం నుంచి పది మంది తెదేపా నేతలతో పాటు భట్టిప్రోలు, అచ్చంపేట, బొల్లాపల్లి నుంచి వచ్చిన అభ్యర్థులు.. రిటర్నింగ్ అధికారి శ్రీధర్‌రెడ్డికి ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. వైకాపా నేతలు బెదిరించారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు.
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని తురకలపట్నం సర్పంచి అభ్యర్థిగా.. వైకాపా నేత నరేంద్ర రెడ్డి భార్య స్వతంత్రంగా పోటీ చేస్తోంది. ఎన్నికల ప్రచారం నిన్న ముగియడంతో.. అధికార పార్టీ నాయకులు తనను పోలీసు స్టేషన్‌కి పిలిపించి రాత్రి 1.30 గంటలకు ఇంటికి పంపించారని ఆమె భర్త పేర్కొన్నాడు. మళ్లీ ఉదయం 7:30కి రమ్మని పెనుకొండ డీఎస్పీ కార్యాలయానికి తరలించారని వెల్లడించాడు. వైకాపాకు మద్దతు ఇవ్వకపోవడంతో తనపై కక్షసాధిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయాడు.
ఇదీ చదవండి: