రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని అనంతపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటోందని అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పంట నష్టాన్ని పరిశీలించాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు నిద్రపోతున్నారని కాలవ దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందులపై ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా శాసనసభ సమావేశాల్లో మాట్లాడలేదని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతుల పక్షాన సీఎం జగన్‌ను ఎమ్మెల్యేలు నిలదీయాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 2018 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ రాయితీగా ఇవ్వాల్సిన 967 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదన్నారు.
ఇదీ చదవండి