ETV Bharat / state

పనికిరాని భూముల్ని కేటాయించి.. ప్రభుత్వం మోసం చేసింది: కామారుపల్లి లబ్ధిదారులు - Anantapur District local news

Kamarupalli Beneficiaries fire on Cm jagan: వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై అనంతపురం జిల్లా కామారుపల్లి జగనన్న కాలనీ లబ్ధిదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి పనికిరాని భూమిని కేటాయించి.. సీఎం జగన్ లబ్ధిదారులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. ఇంటి నిర్మాణం కోసం పునాదిని తీయగా.. రెండు అడుగుల లోతులోనే నీరు వస్తోందని.. 'జగనన్న కాలనీ'ల పేరుతో ప్రభుత్వం అన్యాయం చేసిందని లబోదిబోమంటున్నారు.

jagananna
jagananna
author img

By

Published : Feb 13, 2023, 8:34 AM IST

జగన్‌ సర్కారు కామారుపల్లి లబ్ధిదారులను మోసం చేసింది

Kamarupalli Beneficiaries fire on Cm jagan: ప్రభుత్వమే జాగాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తోంది అనగానే.. సంబరపడ్డామని ఆ నిరుపేదలు చెబుతున్నారు. అప్పులు తెచ్చి మరీ ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు. తీరా పునాదులు తీశాక.. అసలు విషయం తెలిసిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణానికి పనికిరాని భూముల్ని కేటాయించి.. జగన్‌ ప్రభుత్వం తమను మోసం చేసిందని లబోదిబోమంటున్నారు.

జగనన్న కాలనీల ద్వారా 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు అందిస్తున్నామని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇంటి నిర్మాణాలకు సంబంధించి పలుచోట్ల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం పనికిరాని భూములిచ్చి ప్రభుత్వం మోసం చేసిందని అనంతపురం జిల్లా కామారుపల్లి జగనన్నకాలనీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం రెండు అడుగుల మేర పునాదులు తీసినా నీరు వస్తోందని, ఇలాంటి నేలలో ఇళ్లు ఎలా కట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

కామారుపల్లిలో 160 ఎకరాల భూమిలో జగనన్న కాలనీ పేరిట 2021 జనవరి 3న 7 వేల300 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్​సీపీకి చెందిన గుత్తేదారులకు పనుల రూపంలో కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకే.. స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. పనికి రాని భూమిని జగనన్నకాలనీకి ఎంపిక చేశారని మండిపడుతున్నారు. హడావిడిగా బోర్లు, గ్రావెల్ రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. నిర్మాణాలు చేపట్టకుంటే పట్టాలు రద్దుచేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు కనీసం ఈ నెల ఇంటి నిర్మాణానికి పనికొస్తుందా..? లేదా? అని పరీక్షించకుండా 160 ఎకరాల భూమిలో 7300 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిచ్చారు. దీంతో కొంతమంది ఇళ్లు నిర్మించుకుందామని పునాది కూడా తీశారు. రెండు అడుగుల లోతు గుంత తీయగానే నీరు వచ్చింది. ఇలాంటి నేలలో ఇంటి నిర్మాణం కుదరదని లబ్ధిదారులు మధ్యలోనే వదిలేసి వెళ్లారు. వైఎస్సార్​సీపీ గుత్తేదారులకు పనుల రూపంలో లబ్ధి కలిగించేందుకే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు చేపట్టకుంటే పట్టాలను రద్దుచేస్తామని కొంతమంది వైఎస్సార్​సీపీ నాయకులు బెదిరిస్తున్నారు.-కుమార్ మారుపల్లి

గతంలో ఇదే భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందని స్థానికులు చెబుతున్నారు. చవుడు, బంకమట్టి నేల కావడంతో రెండు అడుగుల లోతు తవ్వగానే నీటి ఊటలు రావడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేదని అంటున్నారు. టీడీపీ హయాంలో మంత్రి పరిటాల సునీత.. నిపుణులతో భూ పరీక్షలు చేయించారని.. ఇళ్లు, పరిశ్రమల నిర్మాణాలకు ఈ భూమి యోగ్యం కాదని తేలడంతో లబ్ధిదారులకు మరోచోట స్థలం కేటాయించేలా చర్యలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాంటి భూమిని వైసీపీ నేతలు తమ ప్రయోజనాల కోసం నిరుపేదలకు మళ్లీ మంజూరు చేశారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.