ఇవీ చదవండి.. మాచర్లలో ఉద్రిక్తత..బుద్దా, బొండా వాహనంపై వైకాపా శ్రేణుల దాడి
తెదేపా వర్గీయులపై వైకాపా దాడి.. నామపత్రాలు చించివేత - ధర్మవరంలో తెదేపా వర్గీయులపై వైకాపా దాడి
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద తెదేపా వర్గీయులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. రామాపురం ఎంపీటీసీ స్థానానికి నామపత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థి కేశవపై.. పోలీసుల ఎదుటే వైకాపా శ్రేణులు దాడి చేశారు. నామినేషన్ వేసేందుకు ఎలా వస్తావని బెదిరించారు. నామినేషన్ పత్రాలను చించివేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో.. పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేశారు. పోలీసులు తెదేపా నేతలను మాత్రమే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెదేపా అభ్యర్థులపై వైకాపా వర్గీయుల దాడి