ETV Bharat / state

అధ్వానంగా రోడ్లు... 'అనంత' కష్టాల్లో ప్రయాణికులు

అనంతపురం జిల్లాలో పలు చోట్ల ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. దాదాపు మూడేళ్లుగా రోడ్లకు ఎలాంటి మరమ్మతులు చేయక పోవటంతో ఎక్కడికక్కడ గోతులు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్​అండ్​బీ ప్రధాన రహదారులు మొదలు పురపాలికల వరకు పలు నియోజకవర్గాల్లో రోడ్లు గోతులమయంగా మారాయి. మరమ్మతులు చేయకపోవటంతో గుంతల రోడ్లపై తరుచూ ప్రమాదాల జరుగుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

worst roads
అధ్వానంగా రోడ్లు.
author img

By

Published : Aug 31, 2021, 10:34 PM IST

అధ్వానంగా రోడ్లు... 'అనంత' కష్టాల్లో ప్రయాణికులు

అనంతపురంలోని రహదారులపై గోతులు వాహనదారుల ప్రాణాలు తీసేస్తున్నాయి. మూడేళ్లుగా రహదారులకు కనీస మరమ్మతులు చేయకపోవటంతో ఎక్కడికక్కడ పెద్దఎత్తున గుంతలు ఏర్పడి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వర్షాకాలం ముందు రహదారులకు మరమ్మతులు నిర్వహించేవారు. మూడేళ్లుగా ఆర్అండ్​బీ అధికారులు రోడ్లపై గుంతలకు కనీస మరమ్మతులు కుడా చేయకపోవటంతో వర్షాలకు చిన్నపాటి గుంతలు పెద్ద గోతులుగా మారాయి. కదిరి నుంచి రాయచోటికి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. గోతులుగా మారిన రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని, వాహనాల రిపేర్లకే తమ సంపాదన ఖర్చవుతోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కదిరిలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. నిత్యం వివిధ జిల్లాల నుంచి కదిరి నర్సింహ్మ స్వామి ఆలయ దర్శనానికి, తిమ్మమ్మ మర్రిమాను చూడటానికి వస్తుంటారు. పర్యాటకుల కోసం అనంతపురం నుంచే కాకుండా కడప, చిత్తూరు జిల్లాల నుంచి దర్శనీయ స్థలాల పర్యటన కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. చాలా మంది పర్యాటకులు సొంత వాహనాల్లో కదిరికి వస్తుంటారు. వీరంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు తిరుగుతున్నా.. రోడ్లకు కనీస మరమ్మతులు చేయటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి నుంచి ఎన్పీ కుంట మార్గంలో రెండేళ్లలో 130 రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. తమ గ్రామాలకు చెందిన వారే 40 మంది మృతి చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అట్టహాసంగా శంకుస్థాపన... పనుల్లో ఆలస్యం

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో రెండు నెలల క్రితం రహదారులు,భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ కొత్త రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూలై 5వ తేదీ శిలాఫలకం వేసి వెళ్లారు. నేటి వరకు ఒక్క తట్ట మట్టికూడా ఎత్తలేదు. సోమందేపల్లి క్రాస్ నుంచి హిందుపురానికి వెళ్లే ఈ రహదారి.. ఆనవాళ్లే కోల్పోయి గోతులు పడటంతో రహదారి మరమ్మతులకు రూ.17.50 కోట్లు మంజారు చేసినట్లు మంత్రి ప్రకటించారు. అంతే కాకుండా శిలాఫలకంపై మంత్రి శంకరనారాయణ ఫొటో కూడా వేయించుకొని అట్టహాసంగా రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేశారు. పనులు ఆలస్యం కావటంపై అధికారులెవరూ నోరుమెదపటంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై భారీ గోతులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇదీ చదవండి

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు.. సామూహిక సెలువులపై సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.