మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు ఆరోపించారు. ఈ మేరకు అనంతపురంలోని మున్సిపల్ ఆర్డీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేసిన వారిని ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోందన్నారు.
ఏటా కాంట్రాక్టర్ను కొనసాగించడానికి రెన్యువల్ చేస్తున్నారు కానీ కార్మికులను రెన్యువల్ చేయటం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కేవలం నెల వేతనంగా ఆరు వేలు మాత్రమే పొందుతూ, సెలవులకు కూడా నోచుకోవటం లేదన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని కార్మికులకు 12 వేల రూపాయలే వేతనం ఇస్తూ, ఎలాంటి ప్రయోజనాలు కల్పించటం లేదని సుబ్బారాయడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి