వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అనంతపురంలో శ్రీ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో చేపట్టిన సంగీత నృత్య మహోత్సవం ఆహుతులను ఆకట్టుకుంది. అనంతపురం పీటీసీ మైదానంలో 108 మంది నర్తకులు, 108 మంది గాయకులతో సంధ్య మూర్తి ఆధ్వర్యంలో 3 గంటల పాటు నిర్వహించిన నృత్య మహోత్సవం వండర్ బుక్ రికార్డ్‌లో నమోదైంది. చిన్నప్పటి నుంచి నృత్యం సంగీతంపై ఉన్న మక్కువతో సంధ్యామూర్తి జిల్లాలో మంచి గుర్తింపు సాధించారు. ఈ విద్యను మరి ఎందరికో నేర్పించి కళలకు ప్రాణం పోశారు. తన జీవిత విశేషాలను, సాధించుకున్న అవార్డులు తన లక్ష్యాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
ఇదీ చదవండి: ఆయన తొక్కు తొక్కారంటే .. భక్తులు పరవశించిపోతారంతే!