అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామంలో ప్రజలు మూడు రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా మహిళలు ఖాళీ బిందెలతో మడకశిర - పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 3 తాగునీటి బోరుబావులు ఉండగా... ఒక దానిలో పూర్తిగా నీరు అడుగంటిందని స్థానికులు తెలిపారు. మిగిలిన రెండింటిలోనూ అరకొరగా నీరు వస్తుండటం వల్ల గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: