అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో లక్ష్మీదేవమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామ సమీపంలో ఆమె కుటుంబానికి చెందిన స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. జెసిబి యంత్రంతో పనులు చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన లక్ష్మీదేవిని అక్కడ ఉన్న వారు నిలువరించారు. దీనితో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ తమ స్థలంలో వైకాపా నాయకుల ప్రోద్బలంతోనే సచివాలయం నిర్మాణం చేపట్టారని లక్ష్మీదేవి బంధువులు ఆరోపించారు. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి