కొత్త మద్యం విధానంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ మహిళలు ఒక్కటయ్యారు. అధికారుల వద్దకు చేరుకుని తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కోరారు. వారు పట్టించుకోనందున శుక్రవారం మద్యం షాపుకు తాళాలు వేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న తమ గ్రామంలో బెల్టు దుకాణం ఏర్పాటు వల్ల సమస్యలు వస్తాయని నిరసనకు దిగారు. దయచేసి షాపు తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దుకాణం అలాగే ఉంచితే తాము ఒప్పుకోమని, దీనిపై ఎంత వరకైనా ఉద్యమం చేపడతామని మహిళలు హెచ్చరించారు. ఈ విషయంపై ఉరవకొండ ఎస్సై కి వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి :