అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో ఓ మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. నాయన వారి పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం సిబ్బంది ఆమెను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలిస్తుండగా పురిటి నొప్పుల తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిస్థితిని గుర్తించిన 108 సిబ్బంది వాహనంలోనే మహేశ్వరికి పురుడు పోశారు. మహేశ్వరి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. వైద్య సహాయం కోసం మహేశ్వరిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు