ETV Bharat / state

బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి మృతి.. కూతురు గల్లంతు - అనంతపురం నేర వార్తలు

వారాంతం... సరదాగా కుటుంబమంతా కలిసి బట్టలు ఉతకడానికి కాలువకు వెళ్లారు. కాసేపైతే ఇంటికి చేరుకునేవారే. ఈలోగా మృత్యువు వారి పాలిట శాపంగా మారింది. అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కాలువలో పడిన తల్లి మృతిచెందగా, కూతురు గల్లంతయ్యింది. కుటుంబ పెద్దకు శోకాన్ని మిగిల్చిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

canal incident
బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి మృతి, కూతురు గల్లంతు
author img

By

Published : Feb 14, 2021, 8:17 PM IST

బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి మృతిచెందగా, ఆమె కూతురు గల్లంతైన చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో జరిగింది. సీఐటీయూ కాలనీకి చెందిన విజయ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కావడంతో సరదాగా తన భార్య కూతురితో కలిసి బట్టలు ఉతకడం కోసం కాలువ వద్దకు వెళ్లారు. పట్టణ శివారులోని జి.కొట్టాల వద్ద హంద్రీనీవా కాలువలో.. బట్టలు ఉతుకుతుండగా అతని కూతురు దివ్య ప్రమాదవశాత్తు కాలువలో పడింది. కూతురిని ఒడ్డుకు చేర్చబోయి తల్లి రత్న కూడా కాలువలో గల్లంతైంది.

ఇది గమనించిన విజయ్​.. భార్య, కూతుర్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. భార్యను ఒడ్డుకు చేర్చి.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. దివ్య ఆచూకీ కోసం విపత్తు, పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇదీ చదవండి: బీరు బాటిల్​లో పర్ఫ్యూమ్ స్ప్రే కలిపి... యువకుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.