ETV Bharat / state

108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

author img

By

Published : Nov 6, 2020, 11:30 PM IST

ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారమిచ్చారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్​లోనే ప్రసవం చేశారు.

108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామంలో శాంతమ్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేశారు. వాహనంలో మహిళను మడకశిర ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో వాహనంలోని ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది విజయ్ కుమార్, గీత ఆమెకు ప్రసవం చేశారు. శాంతమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 108 సిబ్బందిని... కుటుంబ సభ్యులు అభినందించారు.

108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పి మోసం చేశాడు... హత్య జరిగినట్లు నాటకమాడాడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.