అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెరువులో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి.