ఈ-బిడ్ కుంభకోణంలో మరో మహిళ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కడియాల సునీల్ భార్య స్రవంతిబాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనంతపురం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. రూ.లక్షకు నెలకు 30 వేలు వడ్డీ పేరుతో దాదాపు 300 కోట్ల వరకు ఈ-బిడ్ సంస్థ మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో వేలాది మంది మధ్య తరగతి ప్రజలు.. అధిక వడ్డీ ఆశతో మోసపోయారు.
ఇదీ చదవండి
cm jagan letter to pm modi: ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ