ETV Bharat / state

పోలీసుల అప్రమత్తతతో అపహరణ కుట్ర భగ్నం

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రమేష్​ను అనంతపురం జిల్లా వెల్దుర్తి సమీపంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ పథకాన్ని భగ్నం చేశారు.

author img

By

Published : Mar 23, 2020, 7:00 AM IST

With the vigilance of the police, the conspiracy to wreck havoc has been ruined
పోలీసుల అప్రమత్తతతో ఆపహరణ యత్నం కుట్ర భగ్నం

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రమేష్​కు అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఉన్న కియా మోటార్స్ పక్కన 105 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2008లో అనంతపురం జిల్లా వైకాపా నాయకులైన ఆదినారాయణ, ప్రభాకర్​లకు విక్రయించారు. ప్రభాకర్ మొత్తం డబ్బు చెల్లించి సగభాగం రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆదినారాయణ మాత్రం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నాడు. మిగతా డబ్బులు ఇవ్వాలని రమేష్​ ఆదినారాయణపై ఒత్తిడి తేవడంతో డబ్బులు ఇస్తామని రమేష్​ని పిలిపించి కారులో ఎక్కించుకుని హైదరాబాదుకు తీసుకెళుతుండగా వెల్దుర్తి వద్ద ఉన్న ఒక డాబా వద్ద కారు ఆపారు. అనుమానం వచ్చిన రమేష్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. జిల్లా ఎస్పీ వెల్దుర్తి పోలీసులను అప్రమత్తం చేయగా వెంటనే ఎస్సై అక్కడకు చేరుకుని అపహరణకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఫిర్యాదు మేరకు ఆదినారాయణతో పాటు, వీరందరిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : జనతా కర్ఫ్యూకు కదిరి ప్రజల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.