MLC Election Counting: MLC elections: ఏపీ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించగా.. పశ్చిమ రాయలసీమలో మాత్రం వైఎస్సార్సీపీ టీడీపీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ, వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. అనంతపురం జేఎన్‌టీయూలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 2,45,687 ఓట్లు పోలైనట్టు తెలిపారు. వీటిలో 2,26,448 ఓట్లు చెల్లనట్లు తేల్చారు. మొత్తం మొత్తం ఓట్లలో 19,239 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో అభ్యర్దుల గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులు జరుపుతున్నారు. ఈ స్థానంలో 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు కనిష్ఠంగా ఓట్లు పొందిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు.33 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 16మంది అభ్యర్థులు మిగిలారు. 33 మంది ఓట్ల లెక్కింపు తర్వాత వైకాపాకు 96,436, తెదేపాకు 94,717 ఓట్లు రాగా.. దీంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంటే వైసీపీ అభ్యర్థి కేవలం 1,719 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సరికి ఉన్నప్పటి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి మెజార్టీ తగ్గింది.
టీడీపీ నేతల గృహనిర్బంధం!.. అనంతపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహనిర్బంధం చేశారు. వారు కౌంటింగ్ కేంద్రానికి వెళ్తారని ముందస్తు చర్యల్లో భాగంగా వారిని ఇంటివద్దే అడ్డుకున్నారు. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 24 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేట్ చేశారు. వారి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ఫలితాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి పోటీచేసిన అభ్యర్థులు 33 అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 16మంది అభ్యర్థులు మిగిలారు. 33 మంది ఓట్ల లెక్కింపు తర్వాత వైకాపాకు 96,436, తెదేపాకు 94,717 ఓట్లు రాగా. టీడీపీ కంటే వైసీపీ ఆధిక్యం 1763 ఓట్లు ఆధిక్యంలో ఉంది. టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను ఎక్కడికి అక్కడ పోలీసులు అవసరస్తులు చేస్తున్నారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లోకి ఇతరులను ఎవరిని రానీయకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అత్యవసరమైతే తప్ప కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లోకి ఇతరులను అనుమతించడం లేదు.
ఇవీ చదవండి: