వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనంతపురం జిల్లా నుంచి పశ్చిమ బంగాల్‌కు చెందిన వలసకూలీలను శ్రామిక్ రైలులో అధికారులు పంపించారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైళ్లలో కూలీలను పంపామని డీఆర్డీఏ పీడీ జిల్లా ఇంఛార్జ్ అధికారి నరసింహారెడ్డి చెప్పారు.
అనంతపురం జిల్లా నుంచి పశ్చిమబంగాల్ వెళ్లే చివరి శ్రామిక్ రైలులోనే పశ్చిమ బంగాల్‌కు చెందిన 1336 మంది వలసకూలీలను... వారి స్వస్థలాలకు పంపించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే బస్సుల్లో పంపించి.. వేరే ప్రాంతాల ద్వారా రైళ్లలో గమ్య స్థానాలకు చేరుస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: