ETV Bharat / state

WATER RELEASE FROM AHOBILAM RESERVOIR IN ANANTAPUR : పెన్నా అహోబిలం రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత.. డ్యామ్ చరిత్రలోనే తొలిసారి!

అనంతపురం జిల్లాలో పెన్నా నదికి ఎగువ నుంచి వరద ప్రవాహం దూసుకొస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల గేట్లూ ఎత్తారు. ఫలితంగా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(water release from ahobilam reservoir) గేట్లనూ ఎత్తారు. ఈ డ్యామ్ గేట్లు ఎత్తడం.. చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
author img

By

Published : Nov 28, 2021, 5:26 PM IST

Updated : Nov 28, 2021, 7:22 PM IST

పెన్నా నదికి ఎగువ నుంచి వస్తున్న వరదతో.. అనంతపురం జిలాల్లోని(penna river water flow) జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో నదిపై ఉన్న అన్ని డ్యామ్​ల గేట్లూ ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా.. జిల్లాలోని పెన్నా అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి, వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.

అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ముందస్తుగా డ్యామ్ గేట్లు ఎత్తినట్లు సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో ఉరవకొండ, కూడేరు తహసీల్దార్​లు డ్యామ్ పరిస్థితిని సమీక్షించారు.

ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తామని, వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని వెల్లడించారు. పెన్నా అహోబిలం డ్యామ్ చరిత్రలో మొట్టమొదటిసారి గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఫొటోలు తీస్తూ.. సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు సందడిగా గడిపారు.

ఇదీచదవండి.

Last Updated : Nov 28, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.