అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లిలో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా సక్రమంగా మంచినీరు అందిస్తున్నా... శివారు గ్రామం కావడం, తక్కువ సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ఉండటంతో ప్రజలందరికీ నీళ్లు అందడం లేదు. నీళ్లు వదిలే సమయానికి తమకు అందుతాయో లేదోనన్న భయంతో... ట్యాంకుపైకి ఎక్కి ముందుగానే నీళ్లు తెచ్చుకుంటున్నారు. గ్రామస్థుల నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: అమ్మితే రూ.2.. కొనబోతే 20