ETV Bharat / state

జలాల సరఫరాలో ‘రాజకీయం’!

అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ, హంద్రీ నీవా కాలువలే ప్రధాన నీటి వనరులు. అటు తుంగభద్ర.. ఇటు శ్రీశైలం కృష్ణమ్మ గలగల సవ్వడి చేస్తూ.. వడివడిగా జిల్లాకు వస్తున్నాయి. ప్రజల దాహార్తి తీరుస్తూ.. కర్షకుల మోములో చిరునవ్వు పంట పండిస్తున్నాయి. ఇంతటి కీలకమైన జలాల సరఫరాలో ‘రాజకీయం’ నెలకొంది.

జలాల సరఫరాలో  ‘రాజకీయం’
జలాల సరఫరాలో ‘రాజకీయం’
author img

By

Published : Sep 29, 2020, 5:11 PM IST

జలాల సరఫరాలో  ‘రాజకీయం’
జలాల సరఫరాలో ‘రాజకీయం’

ప్రధాన ఎగువ కాలువ (హెచ్​ఎల్​సీ), హంద్రీనీవా కాలువ (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌).. ఈ రెండే జిల్లా ప్రధాన నీటి వనరులు. అటు తుంగభద్ర.. ఇటు శ్రీశైలం కృష్ణమ్మ గలగల సవ్వడి చేస్తూ.. వడివడిగా జిల్లాకు వస్తున్నాయి. ప్రజల దాహార్తి తీరుస్తూ.. కర్షకుల మోములో చిరునవ్వు పంట పండిస్తున్నాయి. ఇంతటి కీలకమైన జలాల సరఫరాలో ‘రాజకీయం’ నెలకొంది. నువ్వా, నేనా అంటూ పోటీపడుతూ ఎక్కడికక్కడ వృథా చేస్తున్నారు. దండిగా జలాలు వస్తున్నా.. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ లేకపోవడం బాధాకరం. ఈ దఫా వరుణడు నిండు మనసుతో కరుణించాడు.

భూగర్భ జలాల సమస్య తీరింది. 60 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాకు చేరుతున్న హెచ్చెల్సీ, హంద్రీనీవా నీటిని వీలైనంతగా ఆయకట్టుకు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. నేడు మంగళవారం అనంత రెవెన్యూ భవన్‌లో జిల్లా నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరగనుంది. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కర్నూలు, కడప జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. జిల్లాకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలు, అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.

చౌర్యంపై నిఘా ఏదీ?...

అనంతపురం జిల్లాకు చేరుతున్న తుంగభద్ర, కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. హెచ్చెల్సీకి స్థిరీకరణ ఆయకట్టు ఉంది. పెద్దగా వృథా కావు. కానీ ప్రధాన కాలువపై వేలల్లో పైపులతో జల చౌర్యానికి పాల్పడుతున్నారు. వీటిని ఎక్కడికక్కడ నియంత్రిస్తేనే చివర ఆయకట్టుకు నీరు చేరేది. హంద్రీనీవాలో మరింత భిన్నమైన పరిస్థితి నెలకొంది. పైపులు వేయడమే కాదు.. కాలువకు గండ్లు పెడుతున్నారు. కొన్నిచోట్లా తెంపుతున్నారు. దీనివల్ల వాగు, వంకల్లో వృథాగా వెళ్తున్నాయి. మడకశిర ఉప కాలువ ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర ప్రాంతాలు, ఇటు కదిరి, పుట్టపర్తి వంటి కరవు ప్రాంతాలకు నీరు చేరేలా చూడాలి. జలవనరుల అధికారులదే కాదు.. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాలి. సమష్టిగా జల చౌర్యాన్ని అరికట్టాలి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయం కీలకం.

ఆయకట్టుకు చేరని హెచ్చెల్సీ నీరు..

తుంగభద్ర జలాశయం నుంచి ఈ దఫా దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 24.988 టీఎంసీలు వస్తాయని అంచనా వేశారు. ముందస్తు వర్షాలు కురవడంతో హెచ్చెల్సీకి గత జులై 31న నీరు విడుదల చేశారు. ఆగస్టు ఒకటికి జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇప్పటికే 8.776 టీఎంసీలు విడుదల చేయగా.. జిల్లాకు 7.949 టీఎంసీలు చేరాయి. ప్రధాన కాలువ, జీబీసీ కింద ఆయకట్టు సాగు మొదలు పెట్టారు. ఎమ్పీఆర్‌ కింద అత్యధిక ఆయకట్టు ఉన్నా ఇంకా నీరు విడుదల చేయలేదు. హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 24.988 టీఎంసీల్లో తాగునీటికే 10 టీఎంసీలు కేటాయించాలని సంకల్పించారు. ఫలితంగా ఒకటిన్నర దశాబ్ద కాలం నుంచి శింగనమల, తాడిపత్రి పరిధిలోని చివర ఆయకట్టుకు నీరు చేరడం గగనం అవుతోంది.

హంద్రీనీవా.. చెరువులకే పరిమితం

కొన్ని దశాబ్దాలుగా హెచ్చెల్సీ ఒక్కటే జిల్లాను ఆదుకుంటూ వస్తోంది. ఏడేళ్ల నుంచి హెచ్చెల్సీకి హంద్రీనీవా జత కలిసింది. ఈ దఫా కృష్ణా జలాలు కనీసం 30 టీఎంసీలు ఎత్తిపోయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వానలు దండిగా పడటంతో జులై 22నే కర్నూలు జిల్లా మల్యాల నుంచి శ్రీశైలం జలాలను ఎత్తిపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే నెల 24న జిల్లా సరిహద్దుకు వచ్చాయి. ఇప్పటిదాకా 9.098 టీఎంసీలు ఎత్తిపోయగా.. జిల్లాకు 8.605 టీఎంసీలు చేరాయి. ఒక ఎకరం కూడా ఆయకట్టును స్థిరీకరించలేదు. తొలిదశ కింద 1.18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంది. ఏడేళ్లు గడిచినా పిల్ల కాలువల తవ్వకంపై అతీగతీలేదు. చెరువు, కుంటలకే నీరు పరిమితం అవుతోంది. పీఏబీఆర్‌కు 5 టీఎంసీలు తాగునీటికి కేటాయించాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది.

ఇదీ చదవండి:

దేశంలో తగ్గిన కేసులు.. కొత్తగా 70,589 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.