Village secretariats suspend: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు.. కొద్ది నెలలుగా విధులు ఎగ్గొట్టి వేతనాలు పొందుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. రెండు జిల్లాలో ఇప్పటివరకు 513 మంది కొద్ది నెలలుగా సచివాలయానికి రావటంలేదని అధికారులు తేల్చారు. జిల్లాల పునర్విభజనకు పూర్వం మార్చినెలలో అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా నిఘాపెట్టి పరిశీలన చేయించగా.. 513 మంది గ్రామానికే రాకుండా వేతనం పొందుతున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు వారికి నోటీసులు జారీచేసిన కలెక్టర్ నాగలక్ష్మి.. విధుల నుంచి ఎందుకు తొలగించరాదో సమాధానం చెప్పాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం చెప్పలేదని సమాచారం. తొలిదశలో 513 మందిని విధుల నుంచి తొలగించటానికి కలెక్టర్ దస్త్రం సిద్ధం చేయమని జిల్లా ప్రజాపరిషత్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: