అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేమన సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మొదటిరోజు కుంభం వేడుక జరిగింది. కుంభం తయారు చేసేందుకు అవసరమైన జొన్నలు, గుమ్మడి కాయలను భక్తులు వేమన ఆలయ పూజారులకు సమర్పించారు.
తలనీలాలు, ఇతర మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం, మాస్కుల వాడకంపై పోలీసులు భక్తులందరికీ అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్త జనం హజరవుతున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కదిరి గ్రామీణ సీఐ మధు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
600 గ్రామాలకు తాగునీరందిస్తున్న ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం