అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉయ్యాలోత్సవ సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్చకులు, కమిటీ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలోని రంగమండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతనారసింహుడిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం స్వామి వారికి ఉయ్యాలోత్సవం భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు.
ఇదీ చదవండీ.. ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం