కరోనా రెండో దశ మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అప్పటివరకు కలసిమెలసి తిరిగిన వ్యక్తి పాజిటివ్‌తో చనిపోతే అంతిమయాత్రకు కనీసం నలుగురు వ్యక్తులు రావడం లేదు. కానీ అనంతపురం జిల్లా ఉరవకొండలో మాత్రం ఆపద్భాందవ ట్రస్టు సభ్యులే.. ఆ నలుగురిగా మారారు. కరోనాతో చనిపోయిన వ్యక్తికి చివరి మజిలీ నిర్వహించారు.
పాతపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ మృతదేహాన్ని తాకడానికి కూడా ముందుకు రాలేదు. ఈ విషయం ఆపద్భాందవ ట్రస్టు సభ్యులకు తెలియగా.. వారే పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: