మడకశిరలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం - madakashira latest news
అనంతపురం జిల్లా మడకశిరలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక శ్రీ మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవస్థానం పరిసర ప్రాంతంలోని కొండపై మహిళ శవం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Body:అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ఇలాంటి ప్రదేశంలో ఈ రోజు మడకసిరా పట్టణంలోని శ్రీ మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవస్థానం పరిసర ప్రాంతంలో గల కొండపై ఓ మహిళ శవం కనిపించడంతో పట్టణ వాసులు అవాక్కయ్యారు.
Conclusion:మరణించిన మహిళ మృతదేహాన్ని చూసేందుకు పట్టణ వాసులు కొండపై ఆతృతగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశంలో మృతదేహం యొక్క ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
యు.నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.