అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని ముప్పలకుంట- బొమ్మగాని పల్లి గ్రామాలకు వెళ్లే రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వివాహిత మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య, గ్రామీణ సీఐ శంకర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ శవం ఆచూకీపై అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలికి 35 ఏళ్లు ఉంటుందని, ఇప్పటివరకూ ఎలాంటి ఆచూకీ తెలియలేదనీ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టి తెలుసుకుంటామని తెలిపారు.
మిట్ట కొత్తూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి..
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం మిట్ట కొత్తూరు శ్మశానంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కోటాగరం పంచాయతీకి చెందిన తంగరాజ్గా పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం పేకాట స్థావరాలపై పాతపాళ్యం పంచాయతీలో పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో నలుగురు పేకాటరాయుళ్ల ఉన్నట్లు తెలిసింది. అందులో ఈయన ఒకరు. ఈ నేపథ్యంలో తంగరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి...