అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ కూడలి వద్ద గల రైల్వేస్టేషన్లో మృతదేహం స్థానికులకు కనిపించింది. ఉదయం నుంచి అచేతనంగా మృతదేహం పడి ఉందని స్థానికులు తెలిపారు. కరోనాతో మృతి చెంది ఉండవచ్చనే అనుమానంతో అక్కడికి ఎవ్వరూ వెళ్లలేదన్నారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించినా… ఎవ్వరూ రాలేదని చెప్పారు. పట్టణానికి చెందిన ఆ నలుగురు సంస్థకి విషయం తెలియజేయడం వల్ల అంత్యక్రియలు జరిపేందుకు వారు ముందుకు వచ్చారని తెలియజేశారు. సంఘటనా స్థలానికి గుంతకల్లు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి :