ETV Bharat / state

ANANTHAPUR LOVERS: ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు..కారణమేంటీ ? - అనంతపురం జిల్లాలో తాజా వార్తలు

Love couples suicides: అనంతపురం జిల్లాలో ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో వరుసగా రెండు రోజుల్లో రెండు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. ఏం జరిగిందంటే..?

love couples suicides
ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు
author img

By

Published : Aug 6, 2022, 11:43 AM IST

Updated : Aug 6, 2022, 12:24 PM IST

Love couples suicides: బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామ శివార్లలో చింతతోపులో ఓ జంట బుధవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన ధనుంజయ, రాయదుర్గం పట్టణానికి చెందిన శ్రీకన్య.. నరసాపురం సమీపంలో పురుగుల మందు తాగారు. ఆత్మహత్య చేసుకుంటున్నామని ధనుంజయ.. స్నేహితులకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగా.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. హుటాహుటిన ఆ జంటను రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు.

మరో ఘటనలో ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించలేదని తన తమ్ముడిని వెంట పెట్టుకుని వెళ్లి కాలువలోకి దూకి గల్లంతయింది. అయితే.. అదే సమయంలో మరో యువకుడు(21) కూడా ఆమెతోపాటు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం బెళుగుప్ప మండలం జీడిపల్లి జలాశయంలో బాలిక, యువకుడి మృతదేహాలు తేలాయి. యువకుడిది బెళుగుప్ప మండలం కాగా.. బాలిక గ్రామంలోనే కొన్ని రోజులుగా ఉంటూ జేసీబీ డ్రైవర్​గా పని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని బాలికను తల్లి మందలించడంతో.. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లగా.. 'నీవు లేకుండా నేను కూడా ఉండలేను' అంటూ ఆ యువకుడు సైతం కాలువలో దూకినట్లు ప్రచారం సాగుతోంది. యువకుని ఆచూకీి కోసం తల్లిదండ్రులు జేసీబీ యజమానిని ప్రశ్నించగా.. ఈ విషయం వెలుగు చూసినట్లు సమాచారం. బాలిక తమ్ముడిని ఆరా తీయగా ఇద్దరూ ఒకేసారి కాలువలో దూకినట్లు చెప్పినట్టు తెలుస్తోంది. యువకుడి మృతదేహాన్ని జలాశయం నుంచి పోలీసులు బయటకు తీయించారు. బాలిక మృతదేహాన్ని తీయించాల్సి ఉంది. కాగా.. వీరి మృతిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 6, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.