అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సరిహద్దుల్లో.. చింతపండు లోడుతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు శిరా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులు కర్ణాటకలోని కరేక్యాతనహళ్ళికి చెందిన రైతులుగా గుర్తించారు. బరుగూరు వద్ద వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: