అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శేక్షనుపల్లి గ్రామంలో పిడుగుపాటుకు జనార్ధన్ నాయుడు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి.
గ్రామంలో భారీ వర్షం పడగా.. చెట్టు కిందకు ఎద్దులను తీసుకుని వెళ్లాడు. కాసేపటికే పిడుగుపడి ప్రమాదం జరిగింది. తమకు ఉన్న జీవన ఆధారం కోల్పోయమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
ఇదీ చదవండి: