అనంతపురం జిల్లా రొళ్ల మండలంలోని గుడ్డగుర్కి గ్రామ సమీపంలో ఉన్న బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి చెందాయి. గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ కళేబరాలను పరిశీలించిన అధికారులు అవి రెండు నెలల పిల్ల ఎలుగుబంట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీచదవండి: హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా..?: పవన్ కల్యాణ్