అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వద్ద విషపు ద్రవం తాగి అపస్మారకస్థితిలో పడివున్న యువతిని...కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపునొప్పి తాళలేకే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: