తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని బళ్లారి, రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి జీవనాడి అయిన హెచ్ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేయటంతో ప్రజలు, ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులోని బొమ్మనహళ్ వద్ద ఉన్న కాలువకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనంతపురం నీటి పారుదల శాఖ ఎస్ఈ రాజశేఖర్.. తుంగభద్ర బోర్డు అధికారులను కోరారు.
కనేకల్ హెచ్ఎల్సీ సబ్ డివిజన్ పరిధిలోని బొమ్మనహాళ్ , కనేకల్ మండలాల్లో కాలువ అధ్వానంగా ఉంది. మరమ్మతులు జాప్యం కావడంతో గండ్లు పడే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీచదవండి.