అనంతపురం జిల్లా.. ఉరవకొండ పట్టణంలోని గురువారం సాయంత్రం పాతపేటలో అన్నదమ్ములు మధ్య ఘర్షణ జరిగి అన్నని నరికి చంపిన ఘటనలో.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష నిర్వహించిన తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. అనంతపురం పట్టణానికి చెందిన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నర్రా కేశన్న, వారి బృందం మృతదేహాన్ని వాహనంలో స్మశానానికి తరలించారు. దగ్గరుండి ఖననం చేయించారు. మానవత్వంతో ముందుకు వచ్చి మృతదేహాన్ని ఖననం చేసిన ట్రస్ట్ సభ్యులను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ లాంఛనాలతో శనివారం బాలు అంత్యక్రియలు