ETV Bharat / state

తుంగభద్రకు పోటెత్తిన ప్రవాహం.. రైతుల్లో ఆనందం - తుంగభద్రకు పోటెత్తిన వరద వార్తలు

వరుణుడు... ముందే కరుణించాడు. గత ఏడాదితో పోలిస్తే ముందుగానే వానలు కురుస్తున్నాయి. తుంగభద్ర జలాశయం ఎగువన విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా జలాశయానికి వరద నీరు చేరిక మొదలైంది. ఆశించిన మేర వర్షాల రాకతో కర్షకుల్లో ఆనందోత్సాహం ఉప్పొంగుతోంది. జలాశయంపై ఆధారపడిన హెచ్చెల్సీ అన్నదాతల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. ముందుగానే సాగుకు సిద్ధం కావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

thungabadra
thungabadra
author img

By

Published : Jul 3, 2020, 9:19 AM IST

హెచ్చెల్సీ జలాలు ఒక్క అనంతకే కాదు... కడప, కర్నూలు జిల్లాలకు కూడా సరఫరా అవుతాయనే సంగతి తెలిసిందే. అయితే సింహభాగం ఆయకట్టు జిల్లాలోనే ఉంది. అనంతపురం జిల్లా సగం ప్రాంతాల ఆయకట్టు హెచ్చెల్సీపైనే ఆధారమై ఉంది. తాగునీటి అవసరాలు కూడా తీరుతున్న విషయం విదితమే. అందుకే టీబీ జలాశయం ఇన్‌ఫ్లో, అక్కడ వర్షాలు వస్తున్నాయా లేదా అనే దానిపై జిల్లా అన్నదాతలు నిత్యం ఆరా తీస్తుంటారు.

పుష్కలంగా నీరు...

వానలు ముందుగానే రావడంతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరుతోంది. గత నెల 25 నుంచి ఇప్పటి దాకా రోజూ 5 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. మూడు రోజులుగా కొంతమేర తగ్గిదంతే. గతేడాది ఇదే తేదీల్లో ఇన్‌ఫ్లో శూన్యం. ఒక్క టీఎంసీ కూడా రాలేదు. ప్రస్తుతం గురువారం ఉదయానికి జలాశయంలో 10.505 టీఎంసీలు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే తేదీకి కేవలం 1.871 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇప్పుడు వానలు ఆశించిన మేర వస్తుండటంతో అన్నదాతల్లో ఆశలు పరవళ్లు తొక్కుతున్నాయి.

అంచనాలకు మించి...

గత నెల 9న ఈ దఫా బోర్డు తొలి సమావేశం జరిగింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సీజన్‌లో 191.45 టీఎంసీలు జలాలు లభ్యం అయ్యే వీలుందని భావిస్తున్నారు. ఇందులో వివిధ రూపాల్లో వృథా అయ్యే నీటిని మినహాయిస్తే... 163 టీఎంసీలు నికరంగా ఉంటాయని అనుకున్నారు. ఈ నీటిలోనే ప్రొరేట్‌ ప్రకారం... హెచ్చెల్సీ వాటాగా 24.980 టీఎంసీలు వస్తాయని లెక్కించారు. గతేడాది 30.134 టీఎంసీలు దక్కాయి. దీని ఫలితంగా ఏకంగా 1.09 లక్షల ఎకరాల ఆయకట్టు సాగైంది. దండిగా నీరు పారింది. ఈదఫా కూడా ముందుగా వానలు రావడంతో అదే స్థాయిలో ఆయకట్టు తగ్గకుండా సాగు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

లక్ష ఎకరాలే లక్ష్యం

వానలు ముందే మంచిగా కురుస్తున్నాయి. అందుకే ఇన్‌ఫ్లో మొదలైంది. గతేడాది మాదిరే ఈసారి కూడా జలాలు అధికంగా వచ్చే వీలుంది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే.. సాగుకు కేటాయిస్తాం. ఇదంతా నీటి సలహా మండలి నిర్ణయిస్తుంది. లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగుకు నీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. అందుకే కాలువల పరిస్థితిని కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. - రాజశేఖర్‌, ఎస్‌ఈ, హెచ్చెల్సీ

ఇదీ చదవండి: నేడు లోక్​సభ స్పీకర్​ను కలవనున్న వైకాపా ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.