అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో దొంగతనం చేసేందుకు దొంగలు యత్నించారు. 42వ జాతీయ రహదారిలో ఉన్న ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి దొంగలు తమ ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు వీలుగా సీసీ కెమెరాకు నల్లటి రంగువేశారు. అనంతరం షట్టర్ పగులకొట్టి లోపలికి వెళ్లిన చోరులు.. నగదును అపహరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దొంగతనానికి యత్నించిన ప్రదేశంలో దొంగల ఆచూకీని కనుగొనేందుకు అవసరమైన వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.
ఇదీ చదవండి: